సిరా న్యూస్,నందిగామ;
పాత బస్టాండ్ లో శ్రీ శుఖశామలాంబ సమేత రామలింగేశ్వర దేవస్థానానికి చెందిన స్ధలంలో మద్యం దుకాణం ప్రారంభించారు మద్యం షాపు నిర్వాహకులు. సమాచారం తెలుసుకున్న కార్యనిర్వణాధికారి గంగాధర్ మద్యం దుకాణం వద్దకు చేరుకున్నారు. దేవాదాయ నిబంధనలు ప్రకారం, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆక్ట్ ప్రకారం దేవస్థానం స్థలాలలో గుడి, బడి పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణం నిర్వహించరాదనే నిబంధనలను ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసారు. దాంతో మద్యం దుకాణదారులు అయనతో వాగ్వాదానికి దిగారు.