Loans to Farmers: రుణాలను సద్వినియోగం చేసుకోవాలి…

సిరాన్యూస్, తలమడుగు:

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి…

-చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి 

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అందిస్తున్న దీర్ఘకాలిక రుణాలను సద్వినియోగం చేసుకోవాలని తలమడుగు పిఎసిఎస్ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సహకార సంఘంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఇతర డైరెక్టర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… రైతులకు మరింత నాణ్యమైన సేవలను అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సహకార సంఘంలో ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు. సహకార సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం సీఈవో శ్రీనివాస్, డైరెక్టర్ ప్రతాప్, సిబ్బంది సాగర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *