సిరా న్యూస్, బేల:
బేలలో రోడ్డు ప్రమాదం..
+ రైతు కూలీకి తీవ్రగాయాలు
ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో అంబేడ్కర్ చౌక్ సమీపంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… బేల మండలంలోని చప్రాల గ్రామానికి చెందిన సంతోష్ వ్యవసాయ కూలీగా పనిచేసి జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి, తన బైక్‌పై సాయంత్రం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ సమీపంలో జాతీయ రహాదారిపై లారీ గుద్దుకుంది. దీంతో అతనికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతన్ని చికిత్స కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.