సిరా న్యూస్, గుడిహత్నూర్:
జాతీయ రహాదారిపై లారీ దగ్దం
+ డ్రైవర్, క్లీనర్ సేఫ్
+ షార్ట్ సర్క్యూట్‌తోనే అంటున్న డ్రైవర్
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగోంది గ్రామ సమీపంలో 44వ నంబరు జాతీయ రహాదారిపై రోడ్డుపై వెళ్తున్న లారీ దగ్దమైంది. మహారాష్ట్రలోని అంబాల నుంచి బెంగళురుకి లోడ్‌తో వెళ్తున్న లారీ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ రామ్ కుమార్ లారీని అక్కడే వదిలేసి, బయటకు పరుగులు తీసాడు. కాగా షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు ఆయన చెబుతున్నాడు. లారీ ముందరి భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.