సిరా న్యూస్, బేల:
అందుబాటులో ప్రజాపాలన దరఖాస్తులు
-పంచాయతీ కార్యదర్శి గజానన్
ఆదిలాబాద్ జిల్లా బేల గ్రామ పంచాయతీ పరిదిలో ప్రజాపాలన దరఖాస్తులు అందుబాటులో ఉన్నట్లు పంచాయతీ కార్యదర్శి గజానన్ తెలిపారు. వివిద పథకాల కోసం అర్హులైన వారంత రేషన్ కార్డు చూయించి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకోవాలని ఆయన సూచించారు. కుటుంబానికి ఒకటి చొప్పున మాత్రమే దరఖాస్తు ఫారం ఇవ్వడం జర్గుతుందన్నారు. ఎవరూ కూడ అందోళన చెందవద్దని, తగినన్ని దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ దరఖాస్తు ఫారంలో ఖచ్చితమైన వివరాలను నింపి, మరల ఈ నెల 4న నిర్వహించే గ్రామ సభలో అందించాలని సూచించారు.