సిరా న్యూస్,కమాన్ పూర్;
కమాన్ పూర్ లయన్స్ క్లబ్ కు ఎల్ వి ప్రసాద్ అవార్డు అందజేశారు. ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ 50వేల కార్నియాలు మార్పిడి చేసి ప్రపంచంలోనే మొదటి సంస్థగా రికార్డ్ సృష్టించిన హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు ప్రత్యేక సెమినార్ను నిర్వహించారు. అలాగే నేత్రదానం కు ముందుండి కృషిచేసిన సదాశయ ఫౌండేషన్ ,కమాన్ పూర్ లయన్స్ క్లబ్ కు సంస్థ వ్యవస్థాపకులు గుండ్లపల్లి నాగేశ్వరరావు లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్ కు సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ కు మరియు ప్రధాన కార్యదర్శి లింగమూర్తిలకు ఈ అవార్డును అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొని ఎల్వి ప్రసాద్ బృందాన్ని అభినందించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు కెవిపి రామచంద్రరావు మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. కమాన్ పూర్ క్లబ్ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో కళ్ళు ఎల్వి ప్రసాద్ ల్యాప్ కు పంపడంతో గుర్తించి అవార్డును అందజేశారు. తమ క్లబ్ ను గుర్తించినందుకు లైన్స్ క్లబ్ అధ్యక్షుడు సాన రామకృష్ణారెడ్డి నల్లవెల్లి శంకర్ భీష్మ చారి వాసు శ్రవణ్ కుమార్ లింగమూర్తి అనంతరాములు చంద్రమౌళి ఎల్వి ప్రసాద్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.