సిరా న్యూస్,తాండూర్;
గొప్ప మానవతావాది, మానవతా విలువలను, ఉన్నతమైన ఆదర్శాలను అడుగడుగునా మనకు భోదించే రామాయణం రాసిన ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండల్ లోని వాల్మీకి నగర్ లో గల వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో గురువారం నాడు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి జెండా ఆవిష్కరణ కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘం నాయకులు మాట్లాడుతూ వాల్మీకి ధర్మాన్ని ఎలా రక్షించాలో వాల్మీకి మహర్షి తన రామాయణం ద్వారా ప్రజలకు అందించారని, మనిషి సన్మార్గంలో నడిచేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదని, అటువంటి గొప్ప కావ్యాన్ని రచించిన శ్రీ ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. రామ కావ్యం వెలుగుల్లో మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీ మహర్షి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఎంపిడిఓ శ్రీనివాస్,సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్,సాలిగామ బాణయ్య, బాణయ్య, సిరంగి శంకర్,సూరం రవీందర్ రెడ్డి,మహేందర్ రావు,దాతాత్రేయ రావు,పేర్క రాజన్న,ఎల్క రాంచందర్, పుల్గం తిరుపతి,శేషగిరి,మహేందర్ గౌడ్, జనార్దన్,వెంకటస్వామి,రెహమాత్ ఖాన్,కాంపెల్లి చిన్నయ్య,చందు,శ్రీనివాస్,రాజేశం,సత్యం, వాల్మీకి సంఘాం నాయకులు జంశెట్టి గట్టుమల్లు,ముస్కె లింగమూర్తి,ముస్కె తిరుపతి,మందుల జనార్దన్,ముస్కె సతీష్,సురపతుల శ్రీనివాస్,ముస్కె సాగర్,సురపతుల శ్రీకాంత్,పెనుకూల శ్రీనివాస్,బోగే రాజు,తదితరులు పాల్గొన్నారు.