సిరాన్యూస్, ఉట్నూర్
కొమురం భీం ఆశయాల సాధన కోసం కృషి చేయాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
జల్, జంగల్, జమిన్ కోసం ఆదివాసుల హక్కుల సాధనకై నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొమురం భీం అని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని పేర్కాగూడ గ్రామంలో కేబి కాంప్లెక్స్ లోని కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం పాలన వ్యతిరేకంగా – అటవీ హక్కుల సాధనకై నిరంతరం భీం పోరాడారన్నారు.భీం పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ భీంను ఆదర్శంగా తీసుకోని అయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.