సిరాన్యూస్, సారంగాపూర్
రామ్ సింగ్ తండాలో పిడుగు పాటుకు 70 గొర్రెలు మృతి
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రాంసింగ్ తండాలో పిడుగు పాటుకు 70 గొర్రెలు మృతి చెందాయి. చౌహాన్ వినేష్ అనే వ్యక్తి గొర్రెలు మెపడానికి అడవిలోకి వెళ్లగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అదే సమయంలో పిడుగు పడటంతో 70 గొర్రెలు మృతి చెందాయని బాధితుడు తెలిపాడు. మృతి చెందిన గొర్రెల విలువ దాదాపు రూ. 10 లక్షలు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.