సిరా న్యూస్;
-ఫులే-అంబేద్కర్ ఆశయాల సాధన కొరకు తన జీవితాన్ని అంకితం చేసిన ధీశాలి
-నేడు ఆయన జయంతి
దేశ రాజకియాలలో పెను మార్పులు తెచ్చి బహుజనులకు రాజ్యాధికారం కల్పించి భారత దేశ రాజకీయ చిత్ర పటాన్ని మార్చిన ఘనత మాన్యశ్రీ కాన్షి రాం కు దక్కుతుంది. మాన్య శ్రీ కాన్షి రాం చనిపొయి దశాబ్దం గడిచినది కాని బహుజన నాయుకుడిగా దేశ రాజకీయాలపై అతను ప్రసరించిన ప్రభావంను అతని అనుచరులు, సమర్ధకులు చివరికి అతని వ్యతిరేకులు కూడా విస్మరించ జాలరు.మాన్య శ్రీ కాన్షి రాం ఉత్తర భారత దేశం లో బహుజనులు-దళితుల, వెనుక బడిన, అణగారిన వర్గాల తిరుగు లేని నాయకుడు. అతడు తన జీవీతాంతం పై వర్గాల రాజకీయ అధికార ప్రాప్తి కోసం రాజి లేని పోరాటం సాగించినాడు. చిన్న తనం నుండి సమాజ మార్పు కోసం, రాజకీయాలలో అధికార మార్పు కోసం కంకణం దాల్చినాడు. సైకిల్ పై విస్తృతం గా దేశ వ్యాప్తం గా పర్యటించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం ను ప్రచారం చేసి దళితులకు రాజకియ అదికారం కోసం పాటు పడినాడు. కాన్షి రామ్ మొదట్లో డీఎస్4, బీఏయంసిఈఎఫ్ తరువాత బహుజన సమాజ పార్టి ని స్థాపించినాడు. ఆతరువాత బహేన్ మాయావతి దానికి నాయకత్వం వహించి ఉత్తర ప్రదేశ్ కుల రాజకీయాలను కూకటి వేళ్ళతో ద్వంసం చేసి ముఖ్య మంత్రి అయినది. పంజాబ్ లో జన్మించిన శ్రీ కాన్షి రాం ఉత్తర ప్రదేశ్ ను తన రాజకీయ కేంద్రం గా నిర్ణయిoచుకొన్నారు. ఇతర దళిత నాయకుల వలే కాంగ్రెస్ మరి ఎ ఇతర రాజకీయ పక్షానికి దాసోహం అనలేదు. సంపద, వివాహం, ఇంటిని విడిచి ఫులే-అంబేద్కర్ ఆశయాల సాధన కొరకు తన జీవితం ను అంకితం చేసిన ధీశాలి శ్రీ కాన్షి రాం . దళితులకు శతాబ్దాల వారిగా జరుగుతున్న అన్యాయం, అసమానతల పట్ల శ్రీ కాన్షిరాం తన అసంతృప్తిని, బాధ ను ఆక్రోశం వేల్లుబుచ్చారు. తిలక్,తరాజు ఔర్ తల్వార్ కో మారో అనే నినాదం అగ్రవర్ణాల వారిని కోపానికి గురిచేసింది. కాని కాన్షి రామ్ తన ప్రచారం చేత బహుజన సమాజ్ పార్టి ని దేశ ప్రధాన రాజకీయ పక్షం గా నిలబెట్టారు. మొదట్లో సమాజ్ వాది పార్టి తో పిదప కాంగ్రెస్ తో జత కట్టి బ.స.పా ఉత్తర ప్రదేశ్ లో దళితుల పాలిటి అతి ముఖ్యమైన రాజకీయ పార్టి గా అవతరించినది. ముస్లిం ల సమర్ధన కుడా పొందినది. కుల రాజకీయాలు ఎక్కువగా ఉన్న సామజిక అసమానతలు అధికం గా గల ఉత్తర ప్రదేశ్ లో బ.స.పా. అధికారం లోకి రావడం తో దళితులకు రాజకీయ అధికారం లబించినది. అతని శిష్యురాలు బహెన్ మాయావతి యు.పి. లో రెండు సార్లు ముఖ్య మంత్రి పదవిని పొందినారు.బహుజన సమాజ్ పార్టీ నిర్మాత. రామదాసియా శిక్కు చమార్ కులస్తులైన తేల్సింగ్, బిషన్‌సింగ్ కౌర్ లకు .మార్చి 15, 1934 పంజాబ్ రాష్ట్రంలో రోపార్ జిల్లా కావాస్పూర్ గ్రామంలోజన్మించాడు. జ్యోతిరావుఫూలే, ఛత్రపతి సాహు మహరాజ్, పెరియార్ ఇ.వి. రామస్వామి నాయకర్, నారాయణగురు, అంబేద్కర్ ల ప్రబోధాలను రాజ్యాధికారం వైపు నడిపి విజయాలు సాధించాడు. తన 31వ ఏటనే అంబేద్కర్ రచించిన ‘కుల నిర్మూలన ‘ గ్రంథం ద్వారా ప్రేరేపితుడయ్యాడు. తన తల్లికి ముప్ఫై పేజీల ఉత్తరం రాస్తూ ‘ఇక నుంచి నేను కుటుంబ బాంధవ్యాలను తెంచుకుంటున్నాను. నా కోసం మీరు వెతకవద్దు’ అంటూ బయటికి వెళ్లి, చనిపోయే వరకు తిరిగి ఇంటికి వెళ్లలేదు. 1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించాడు. ఒక ఓటు-ఒక నోటు అనే నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లి వారిచ్చే డబ్బుతోనే ప్రచారం చేశాడు. కులాన్ని నిర్మూలిద్దాం-బహుజన సమాజాన్ని నిర్మిద్దాం అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాడు. నువ్వు 85 శాతం ఉండగా 15 శాతం మీద ఎందుకు ఆధారపడతావు? నడువు పార్లమెంటు, అసెంబ్లీకి నడువు. నీ కాళ్లమీద నీవే నడువు అంటూ బహుజనులను ఉసిగొల్పాడు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి. ప్రజల భూమి మీద ప్రజలకు హక్కులేదా? అనేవాడు. కులాన్ని కులంతోనే జయించాలని కులాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకున్నాడు. యూపిలోని చమార్లనే పునాదిగా చేసుకొని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కాశ్మీర్, బీహార్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లలో ఇతర కులాలను కలుపుకొని పార్టీని బలోపేతం చేశాడు. మాయావతిని ముఖ్యమంత్రిగా చేశాడు. 1984లో ప్రారంభమైన బిఎస్పి 1996 నాటికి జాతీయ పార్టీగా ఎదిగింది. 2006 అక్టోబరు 9న కాన్షీరాం మరణించారు. భారత దేశ దళిత చరిత్ర లో శ్రీ కాన్షి రామ్ బహుజనులకు రాజ్యాధికార సాధన లో సాధించిన విజయం మరుపు రానిది.