సిరా న్యూస్,బీజూపూర్;
సుక్మా జిల్లా చింతగుఫాపోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు-నక్సలైట్ల ఎదురు కాల్పులు జరిగాయి. తుమల్పాడ్ అటవీ-కొండలో జరిగింది. ఘటనలో కుప్ప అనే మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలంలో ఆయుధాలతో సహా పెద్ద మొత్తంలో నక్సలైట్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ లో పాల్గొన్న డిస్ట్రిక్ట్ ఫోర్స్, డీఆర్జీ, బస్తర్ ఫైటర్ దళాలు పాల్గోన్నాయి. ఘటనా స్థలంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.