సిరా న్యూస్,నల్గోండ;
మండపేటనుంచి హైదరాబాద్ వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ జరిగింది. మహిళ బ్యాగ్ లో 15లక్షల విలువగల బంగారు ఆభరణాలను దొంగలు అఫహరించారు. బ్యాగ్ లో బంగారం కనిపించకపోవడంతో రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద బస్సును డ్రైవర్ నిలిపివేసాడు. బాధిత మహిళ పిర్యాదు తో బస్సును అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసు స్టేషన్ కు తరలించారు. ఉదయం 6 గంటల నుండి పోలీసు స్టేషన్ లో 40 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.