సిరా న్యూస్,కోదాడ;
అక్రమంగా గ్రానైట్ రాయిని తరలిస్తున్న వాహనాలను మైనింగ్ అధికారులు పట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మైనింగ్ అధికారుల కథనం ప్రకారం.. అనంతగిరి మండలం బొజ్జగూడెం పరి ధిలో కోదాడ మండలంలోని చిమిర్యాల మిడ్వెస్ట్ కంపెనీ నుంచి ఎలాంటి అను మతులు లేకుండా 13 లారీల్లో గ్రానైట్ రాయిని ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మైనింగ్ అధికారులు క్షేత్రస్థా యిలో మొదటగా 6 లారీలు పట్టుకోగా, తర్వాత మరో 7 లారీలను అదుపులోకి తీసుకు న్నారు. చలానాలు చెల్లించేవరకు సీజ్ అయిన వాహనాలను కోదాడ పట్టణ పరిధిలో భద్రపరిచారు. అనుమతి లేకుండా గ్రానైట్ను తరలిస్తుండగా గ్రానైట్ను సీజ్ చేసి రూ.15 లక్షలకు పైగా జరిమానా విధించామని మైనింగ్ జిల్లా అసిస్టెంట్ జియాలజిస్ట్ విజయరామరాజు తెలిపారు. అధిక లోడుతో వెళ్తున్నందున వాహనాలను సీజ్ చేశామని మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ జిలాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ సిబ్బంది రామ్మూరి, వెంకన్న, శ్రీనివాస్ తదితరులు తెలిపారు….