సిరా న్యూస్,విజయవాడ;
శుక్రవారం నాడు రాష్ట్ర మునిసిపల్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి నారాయణ, కేంద్ర హుడ్కో అధికారులుతో కలిసి ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈఓ కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో వీరికి స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించారు.
ఈ బృందంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హుడ్కో సీఎండి సంజయ్ కులక్ష్రేష్ఠ, డీసీపీ ఎం. నాగరాజ్, రిజినల్ చీఫ్ బీఎస్యే మూర్తి తదితరులు ఉన్నారు. అమ్మవారి దర్శనానంతరం వారికి ఆలయ వేదపండితులచే వేదాశీర్వచనం కల్పించి, అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేసారు. .