మూసీ బాధితులకు అండగా బిజెపి

సిరా న్యూస్,హైదరాబాద్;
మూసీ బాధితులకు అండగా ఇందిరాపార్కు వద్ద బిజెపి మహాధర్నా నిర్వహించింది. మూసీ బాధితులు, పేదలు, మధ్యతరగతి ప్రజల పక్షాన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన మహాధర్నా కొనసాగింది. మూసీ సుందరీకరణ-పునరుజ్జీవం పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్లను కూల్చుతూ చేస్తున్న విధ్వంసకాండను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు పాల్గోన్నారు. మూసీ బాధితులు, ప్రజలు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *