సిరా న్యూస్,మంథని;
దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంథని మున్సిపల్ పరిధిలోని మహిమాన్విత మహాలక్ష్మి ఆలయంలో తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శుక్రవారం నవరాత్రి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. దేవినవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మహాలక్ష్మి దేవి గాయత్రీ దేవిగా పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించి మంథని నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడు తల్లి అని ఆయన కోరుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వర్ణకార సంఘ భజన బృందం తో పాటు మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని, మహాలక్ష్మి అమ్మవారికి కీర్తనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్లి రమా సురేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తొట్ల తిరుపతి యాదవ్, ఒడ్నాల శ్రీనివాస్, దుద్దిళ్ల గణపతి, ఆకుల కిరణ్, సోషల్ మీడియా ఇన్చార్జి కిరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.