సిరా న్యూస్,నరసరావుపేట;
నరసరావుపేట పట్టణంలో గురువారం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు సత్తెనపల్లి రోడ్డులోని కోడెల స్టేడియం వద్ద గల అన్న క్యాంటీన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్యాంటీన్లో పని చేస్తున్న ఉద్యోగుల వద్ద నుంచి ఆహార సరఫరా వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.