సిరా న్యూస్,హైదరాబాద్;
విలక్షణమైన నాయకుడు రేవంత్ రెడ్డి. చిన్న వయసులో రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా ఎదిగిన వ్యక్తీ రేవంత్ రెడ్డని టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రస్తానం పై రచయితలు వేణుగోపాల్ రెడ్డి, విజయార్కే రాసిన ఒకే ఒక్కడు పుస్తకాన్ని అయన ఆవిష్కరించారు. మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి, నిర్బందాలతో పాలన చేస్తున్న కేసీఆర్ పైన పోరాటం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా పుస్తక ఆవిష్కరణ చేసుకున్నాం. ఒకే ఒక్కడు పుస్తకాన్ని రచించిన రచయితలకు అభినందనలు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి నుంచి ముందుగా రేవంత్ రెడ్డికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండాలని మనస్సుపూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు..