సిరా న్యూస్,నరసరావుపేట;
నరసరావుపేట పట్టణంలో పలు చోట్ల పారిశుధ్య పనుల ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు పలు వార్డులలో పరిశీలించారు. రోడ్లు మరియు డ్రైనేజీ కాలువల మరమ్మతుల పనులను పరిశీలించారు. త్వరగా మొదలుపెట్టిన పనులను పూర్తిచేయాలనీ అధికారులను ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు ఆదేశించారు. వార్డులోని ప్రజలను కలిసి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు పట్టణంలో పర్యటిస్తాను, ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, వార్డు కూటమి నేతలు పాల్గొన్నారు.