సిరాన్యూస్, బోథ్
కుచ్చిరియాల గ్రామం సమస్యలను పరిష్కరిస్తా : ఎమ్మెల్యే జాదవ్ అనిల్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన కుచిర్యాల తాండ వాసులు గురువారం స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ ను కలిసి తమ గ్రామ సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని, అంతేగాక రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే రోడ్డు సౌకర్యం ఏర్పాటుకు తన వంతు సహకారం ఉంటుందని గ్రామస్తులకు తెలిపారు.