సిరాన్యూస్, మానకొండూర్:
వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ, నుస్తులాపూర్, బాలయ్యపల్లి, మొగిలిపాలెం, పోలంపల్లి, నర్సింగాపూర్, మల్లాపూర్, మన్నెంపెల్లి, పోరండ్ల గ్రామాలలో సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో,ఐకేపీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.