సిరా న్యూస్,పటాన్ చెరు;
ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల విషయంలో సంపూర్ణ సహకారం అందించాలని బిహెచ్ఇఎల్ పరిశ్రమ ఉన్నతాధికారులను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బిహెచ్ఎల్ పరిశ్రమ ఈడి భరణి రాజాతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమావేశమయ్యారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారంలో బిహెచ్ఇఎల్ ఎస్టేట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ఈడి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా.. మున్సిపల్ పరిధిలోని ఎం ఐ జి 2 పరిధిలో అంతర్గత మురుగునీటి కాలువ నిర్మాణ పనులకు, ఎం ఐ జి 2 ముఖ ద్వారం నుండి అన్నమయ్య కాలనీ మీదుగా బి మ్యక్ వరకు గల రహదారిని మూసివేశారని వెంటనే ప్రారంభించాలని, అంతర్గత రహదారుల మరమ్మత్తు పనులకు అనుమతించాలని కోరారు. ఎస్టేట్ అధికారుల అభ్యంతరాల మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు.. అభివృద్ధికి నోచుకోవడం లేదని తెలిపారు. ఎందుకు సానుకూలంగా స్పందించిన బెల్ ఈడి.. త్వరలోనే సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు మల్లేపల్లి సోమిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.