సిరాన్యూస్, భైంసా
పాలజ్ కర్ర వినాయకున్ని దర్శించుకున్న ముధోల్, బోథ్ ఎమ్మెల్యేలు
మహారాష్ట్ర లోని భోకర్ తాలూకా లోని పాలజ్ కర్ర వినాయకుడిని ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా ప్రత్యేక పూజలు అందుకుంటున్న కర్ర వినాయకుణ్ణి దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు తెలంగాణ వ్యాప్తంగా ఉండాలి అని విజ్ఞాలను తొలగించే వినాయకుణ్ణి మొక్కుకున్నారు.