సిరాన్యూస్, ఆదిలాబాద్
జోరుగా కొనసాగుతున్న బీజేపీ సభ్యత్వం: ఎమ్మెల్యే పాయల్ శంకర్
తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం మెదక్ సంగారెడ్డి జిల్లాలో,అసెంబ్లీ నియోజకవర్గం లో జరుగుతున్న అటువంటి సభ్యత్వ నమోదు తీరుని పరిశీలించారు. ప్రజాస్వామ్య దేశాలలో నే ప్రపంచ దేశాలలో లోనే కాకుండా ఎక్కువ సభ్యులు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. ఏ ఇంటికి వెళ్లిన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే ఉంటామని చెబుతున్నారన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ నాయకులు, జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు.