సిరా న్యూస్,కమాన్ పూర్;
ఆ రైతు ఐడియా మూగజీవాలకు వరంగా మారింది.మనకు వర్షాకాలంలో దోమలు కుడితే దోమలను పారదోలెందుకు ఎన్నో ఉపయోగాలు వేస్తాం.
మనకు దోమలు కుట్టకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మూగజీవాలకు ఆరు బయట కట్టి వేయడంతో వాటికి దోమలు కుట్టి ఎంతో ఇబ్బందులకు గురవుతుంటాయి. అలాగే పాల శాతం సైతం తగ్గుతుంది.కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన అన్నవేన రాజయ్య అనే రైతు తమ గేదెలకు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. దీనిలో భాగంగా తామ గేదెల గుడిసెకు పూర్తిగ దోమల తెర కట్టి వాటికి దోమల కుట్టకుండా జాగ్రత్త తీసుకున్నాడు. మనం సైతం మూగజీవాలకు ఇటువంటి సౌకర్యాలు కలిగిస్తే మూగజీవాల దీవెన సైతం మనకు ఉంటుందని ఆశిద్దాం.