MLA Payala Shankar: బేల‌లో సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల శంకర్

సిరాన్యూస్‌,బేల‌
బేల‌లో సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల శంకర్

ఆదిలాబాద్ జిల్లా బేల‌లో సోయా కొనుగోలు కేంద్రాన్నిగురువారం ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల శంకర్ ప్రారంభించారు.ఈ సంద‌ర్బంగాబేలా మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంల‌ ఎమ్మెల్యే మాట్లాడుతూ పంటలు అమ్మడానికి వచ్చే రైతులకు కోసం ఉచితంగా పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఎంతో కష్టపడి పండిస్తున్న పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తున్నారు. పంట కొనుగోలు విషయంలో రైతులకు ఏ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను వివరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చరవాణి ద్వారా అదిలాబాద్ రైతులు కేవలం 6 క్వింటాలే సోయ కొనుగోలు విషయంలో మాట్లాడడం జరిగిందన్నారు. స్పందించిన మంత్రి 6 క్వింటాలు కాకుండా పది క్వింటాలు సోయ కొనుగోలు చేసేలా ఉత్తర్వులు జారీ చేస్తామని అన్నారు. పంట చేనుకు ఫెన్సింగ్కు 20% రైతులు పెట్టుబడి పెడితే మిగతా శాతం పెట్టుబడి ప్రభుత్వమే భరించేలా ఒక పథకాన్ని ప్రారంభించే ఆలోచనల ఉందన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు దత్తా నికం, గణేష్ బొంగిర్వార్, మాజీ సర్పంచ్ ఇంద్ర శేఖర్, రాకేష్, మొరేశ్వర్, సందీప్, మహేష్, రాము, జీవన్ రెడ్డి, నవీన్ పోతూ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *