సిరాన్యూస్,ఓదెల
ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని చిత్రీకరించిన సుమన్ టీవీ
పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సుమన్ టీవీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ ఈశ్వర్ దర్శించుకున్నారు. ఈసందర్బంగా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని స్థలా పురాణం, స్వామివారి విశేషాలు విశిష్టత ,కండల స్వామి వారి స్థల పురాణం, రామాలయం విశిష్టత , దేవస్థానం పూర్తి సమాచారం గురించి దేవస్థానం ప్రధాన అర్చకులు దూపం వీరభద్రయ్య నుండి ఇంటర్వ్యూ తీసుకున్నారు. అనంతరం సుమన్ టీవీ నిర్వాహకులకు దేవస్థానం చైర్మన్ మేకల మల్లేష్ యాదవ్ గుడి ఆవరణలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యాంకర్ జాహ్నవి, ఫోటోగ్రాఫర్ శ్రీను ,భాస్కర్ల శ్రీనివాస్, కమిటీ మెంబర్లు మెడగొని శ్రీకాంత్ , బత్తుల రమేష్ బాబు, చింతం వెంకటస్వామి, మొగిలి తదితరులు పాల్గొన్నారు.