సిరాన్యూస్,ఓదెల
దసరా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ
* అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు
సద్దుల బతుకమ్మతో పాటు దసరా వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ కోరారు. గురువారం పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ గజ్జి కృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ప్రజలు సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగుండం సిపి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగే ప్రదేశంలో పోలీసులు మఫ్టీలో ఉంటారని స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. దసరా వేడుకల రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తామని వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.