సిరాన్యూస్,ఓదెల
ఓదెలలో సద్దుల బతుకమ్మ వేడుకలు
ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాములై సందమామ.. చూడ జాములై సందమామ.. శివుడు రాకపై సందమమా అంటూ ఓదెలలో హోరెత్తింది.తెలంగాణ ప్రత్యేక పండుగైనా బతుకమ్మ పండుగ వేడుకలు గురువారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో శివాలయం దగ్గర రంగారంగ వైభవంగా నిర్వహించారు. ఈసందర్బంగా గ్రామపంచాయతీ నిర్వాహకులు ఐమాక్స్ లైట్లతో సిరీస్ బల్బులతో బతుకమ్మ ఆడే స్థలంలో ఆకర్షణీయంగా వేదికలు తయారు చేశారు. బతుకమ్మ.. బతుకమ్మ ..ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో…. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరకే అమ్మో వాడలోనా పాటలతో మహిళలు బతుకమ్మ ఆడారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ఓదెల టు చిత్రం బతుకమ్మలపై చిత్రకరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ , మాజీ ఎంపీటీసీ బోడకుంట లక్ష్మి చిన్న స్వామి గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.