సిరా న్యూస్, లోకేశ్వరం:
కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
– ముథోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలంత సద్వినియోగం చేసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్ అన్నారు. శనివారం ఆయన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధి బీజేపీతో సాధ్యమన్నారు. మరో మారు నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.