MLA Surendra Babu: అన్ని గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రం చేయండి : ఎమ్మెల్యే సురేంద్రబాబు

సిరాన్యూస్, కళ్యాణదుర్గం
అన్ని గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రం చేయండి : ఎమ్మెల్యే సురేంద్రబాబు
* ఉద్యాన పంటలకు ఆలస్యం లేకుండా బిల్లులు వచ్చేలా చూస్తా…

గ్రామీణ ప్రాంతాల అభివృద్దే నా లక్ష్యం అని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. పట్టణంలోని ప్రజా వేదిక వద్ద నియోజకవర్గంలోని అన్ని మండలాల మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, క్లస్టర్ ఇంచార్జులు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లతో ఉద్యాన పంటలు, ఉపాధి పనులపై ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ…గతంలో లాగ బిల్లులు ఆలస్యం కాకుండా రైతులకు అందేలా చూస్తామన్నారు. నియోజకవర్గం లో 3500 ఎకరాలు నియోజకవర్గానికి ఒక్కటే అనుమతులు ఇచ్చారని, అవసరమైతే మరిన్ని ఎకరాలకు కూడా అనుమతులు ఇచ్చే విధంగా చూస్తామని తెలిపారు. రాబోవు రోజుల్లో మన ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తాయి, రైతులు పండ్ల మొక్కలు నాటుకుంటే అవి మన భవిష్యత్తుకు బాగుంటాయని, మన కుటుంబానికి, మన పిల్లలకు ఉపయోగం ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ప్రతి గ్రామంలోనూ ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిని వినతిపత్రం రూపంలో ఈ నెల 15న పల్లె పండుగ కార్యక్రమానికి విచేస్తున్న కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాల‌ని చెప్పారు. మన ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైనేజిలు, తారు రోడ్లు, విద్యుత్, వీధి లైట్లు, తాగునీరు, ఇల్లు, స్థలాలు, పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా సమస్యలు పరిష్కరించుకునేందుకు వీలు ఉంటుందన్నారు ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్లు, బ్లాక్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్, గొర్రెలు, పశువులకు షెడ్లు నిర్మించుకుని ఉపాధి పొందాలని అందరూ సక్రమంగా వాటిని ఉపయోగించుకోవాలన్నారు. మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయగలిగితే మరిన్ని నిధులు మన నియోజకవర్గానికి కలెక్టర్ మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారని, గత ప్రభుత్వంలో చాలా మంది కాంట్రాక్ట్ వర్కులు చేసి బిల్లులు రాక నానా ఇబ్బందులు పెట్టారు, ఇప్పుడు ఆలా కాకుండా మీరు చేసే పనిని బట్టి వారంలోగా బిల్లులు అందేలా చూస్తా.. గ్రామంలో అందర్నీ కలుపుకుని సమన్వయంతో పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని తెలిపారు. ఈస‌మావేశంలో అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *