సిరా న్యూస్, ఖానాపూర్:
ఎమ్మెల్యేను కలిసిన పెంబి నాయకులు…
నిర్మల్ జిల్లా పెంబి గ్రామానికి చెందిన కాంగ్రేస్ నాయకులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సోమవారం ఉట్నూర్‌లో నిర్వహించిన సభకు తరలివెళ్ళిన నాయకులు, ఎమ్మెల్యేతో తమ గ్రామ సమస్యలను గురించి మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామం పూర్తిగా వెనకబడి పోయిందని వాపోయారు. పెంబి ప్రజలంత కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకొని ఉందన్నారు. కాగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పెంబి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. తనను ఒట్లేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రేస్ నాయకులు, ప్రముఖ్య న్యాయవాది సల్ల ప్రశాంత్ రెడ్డి, పుప్పల నర్సయ్య, వడ్ల మోహన్, తులాల రజలింగు, మల్లేపల్లి స్వామి, బోరే నరేష్, మేర నర్సయ్య, కస్తూరి గంగాధర్, సల్ల స్వప్నిల్ రెడ్డి, తులాల శంకర్, భూమేష్, తదితరులు ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సన్మానించారు.