సిరాన్యూస్, దస్తురాబాద్
పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.బుధవారం నిర్మల్ జిల్ల దస్తురాబాద్ మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీ గోడతో పాటు గ్రౌండ్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పాఠశాలల, కళాశాలల అభివృద్ధికి పాటుపడుతుందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలను నెలకొల్పి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పాఠశాల-కళాశాలలో నెలకొన్న సమస్యలను దశల వారిగా పరిష్కారం చేస్తున్నామన్నారు.రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.పేదల సంక్షేమానికి పెద్దపిట వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.