సిరాన్యూస్, దస్తురాబాద్
బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలో మండల వాసీ బరిగేల వెంకటేష్,బుత్కూరు గ్రామంలో కోట ప్రభాకర్,ఎర్రగుంట గ్రామంలో అజ్మీరా రాకేష్, మల్లాపూర్ గ్రామంలో మోతే చిన్న మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతు ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.అదే విధంగా గోడిసిర్యాల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఇల్లు కూలిన కుటుంబాన్ని,బుట్టపూర్ గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకులు గుండా నరేష్ తండ్రి గుండా గంగారాజం వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.