సిరాన్యూస్, ఓదెల
త్వరలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం : ఎమ్మెల్యే విజయ రమణారావు
* రోడ్డు విస్తరణ ప్రాంతాల పరిశీలన
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కేంద్రంలో మడక రోడ్డు నుండి ఓదెల మల్లిఖార్జున స్వామి దేవాలయం వెళ్లే ప్రధానమైన రహదారి వెడల్పు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. గ్రామస్తుల సూచన మేరకు మంగళవారం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రోడ్డు నిర్మాణం కోసం కాంట్రాక్టర్ల, సంబంధిత శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులతో కలిసి రోడ్డు విస్తరణ ప్రాంతాలను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓదెల గ్రామస్తుల సహకారంతోని ఆలోచన విధానంతో రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగలానే ఆకాంక్షతోని గ్రామంలో పెద్దలందరు కూడా ముందుకు రావడం చాలా సంతోషకారమన్నారు. రోడ్డు వైడానింగ్ చేసి బీటీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం గ్రామస్తులు కోరిక మేరకు 36 ఫిట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అలాగే 3 నుండి 4 రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పారు. అలాగే గ్రామ ప్రజలందరూ రోడ్డు వెడల్పు సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో పొత్క పల్లి ఎస్సై అశోక్ రెడ్డి, ఎంపీడీవో జి తిరుపతి, ఎంపీ ఓ, గ్రామ కార్యదర్శి చంద్రారెడ్డి , ప్రత్యేక అధికారులు,ఓదెల మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బోడకుంట లక్ష్మి చిన్న స్వామి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, చీకట్ల మొండయ్య, గోపతి సదానందం తీర్థాల వీరన్న, బండారి కుమారస్వామి, సంతోష్, గోపు నారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు ,గ్రామ పెద్దలు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు