సిరాన్యూస్, ఆదిలాబాద్
వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి: సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్
ఆదిలాబాద్ జిల్లా లో ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు వసతి గృహల్లో ఏఎన్ఎం లుగా పనిచేస్తున్న ఏఎన్ఎం ల సమస్యలు పరిష్కరించాలని, ఏడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఎన్ఎం ల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ , జిల్లా గిరిజన అభివృద్ది అధికారి స్పందించాలని ఏఎన్ఎంలకు 7 నెలల నుండి వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.గత 7 నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుచున్నారని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా అవుట్ సోర్సింగ్ ఏజెన్సికి చెప్పిన పట్టించుకొని పరిస్థితులలో ఉన్నారని అన్నారు. ఏఎన్ఎంలు పాఠశాలల్లో వసతిగృహల్లో స్థానికంగా ఉండి ఆదివాసీ గిరిజన విద్యార్థులకు 24 గంటలపాటు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారని. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని అన్నారు. ఏఎన్ఎంలకు ఎలాంటి అత్యవసరం వచ్చిన ఒక రోజు కూడా సెలవు ఇవ్వకుండా, వేతనాల్లో కోతలు విధిస్తున్నారని కనీసం. వీరికి ఉండడానికి వసతి సౌకర్యాలు కూడా లేవని పీఎఫ్ కటింగ్ చేస్తున్నామని చెబుతున్నారు, కాని కటింగ్ విషయంలో పూర్తి సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు .తక్షణమే స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పీఎప్,ఈఎస్ ఐ పెన్షన్ ఇన్సూరెన్సు సౌకర్యాలు కల్పించాలని కోరారు.ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గుర్తింపు కార్డులను ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు జే రాజేందర్ ఏఎన్ఎం యూనియన్ అధ్యక్షకార్యదర్శులు కె. కమల, ఆర్. అనిత కోశాధికారి శ్యామ్ సుందర్ ఉపాధ్యక్షులు నర్మద కామేశ్వరి సహాయ కార్యదర్శులు జంగుబాయి అశ్విని సభ్యులు విజయ్ కుమార్ రాజేశ్వర్ ఇతర ఏఎన్ఎం లు పాల్గొన్నారు.