సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన ఎమ్మెల్యే విజయరమణ రావు
హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వాటర్స్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను మంగళవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్ కుమార్ ,కరీంనగర్ సూడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి ,అంతటి అన్నయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.