సిరాన్యూస్,కాల్వశ్రీరాంపూర్
ముదిరాజ్ మత్స్య సహకార సంఘం కూనరం అధ్యక్షులుగా పెండెం రాజేశం
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనరం గ్రామ ముదిరాజ్ మత్స్య సహకార సంఘం అధ్యక్షులుగా పెండెం రాజేశంను ఎన్నుకున్నారు. ఈ గ్రామం ముదిరాజ్ మత్స్య సహకార సంఘం ఎన్నిక రెండు సంవత్సరాల నుండి కోర్టులో పెండింగ్ ఉండి తీర్పు రావడం తో గురువారం ఓట్ల లెక్కింపు చేశారు. శుక్రవారం ముదిరాజ్ మత్స్య సహకార సంఘం అధ్యక్షులుగా పెండెం రాజేశం, ఉపాధ్యక్షులుగా జంగిటి కొమురయ్య, సెక్రటరీ జంగిటి సదానందం, క్యాషియర్. ఏలవేణి స్వామిలను ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా అధ్యక్షులు పెండెం రాజేశం మాట్లాడుతూ నాపై నమ్మకంతో గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘానికి ఎల్లవేళలా కృషి చేస్తా
నని తెలియజేసారు.