Municipal Chairman Rajura Satyam: లేబర్ కార్యాలయం స్థ‌ల ప‌రిశీల‌న : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

సిరా న్యూస్‌,ఖానాపూర్ టౌన్
లేబర్ కార్యాలయం స్థ‌ల ప‌రిశీల‌న : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో లేబర్ కార్యాలయం నిర్మించ‌డానికి శ‌నివారం స్థ‌లాన్ని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖానాపూర్ పట్టణ , పరిసర ప్రాంత ప్రజల కోసం అందుబాటులో మున్సిపాలిటీ పాలకవర్గం తరఫున నూతన లేబర్ కార్యాలయం నిర్మించబోతున్నామని తెలిపారు. మున్సిపాలిటీ ఉద్యానవనం పార్కు వద్ద స్థలంను పరిశీలించామ‌ని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నాయకులు షబ్బీర్ పాషా , మున్సిపల్ కమిషనర్ మనోహర్, లేబర్ కార్యాలయం అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *