సిరా న్యూస్,భీమదేవరపల్లి
అంబేద్కర్ విగ్రహాలకు ప్రభుత్వ రక్షణ కల్పించాలి: తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్
అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, అంబేద్కర్ విగ్రహాలకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తూ దేశవ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేప్యాల ప్రకాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం భీమదేవరపల్లి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్ జిల్లా శివంపేట మండలం కాంతం పల్లి గ్రామంలో గత మూడు రోజుల క్రితం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగిందన్నారు. అంబేడ్కర్ విగ్రహాల చుట్టూ భారత దేశవ్యాప్తంగా ఎక్కడైతే విగ్రహాలు ఉన్నవో అక్కడ పకడ్బందీగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షిస్తూ చట్టపరమైన శాఖపరమైన కేసులతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో మాడుగుల సంపత్ కుమార్, వేముల జగదీష్ ,మాడుగుల జయపాల్ ,ఇల్లందుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.