సిరా న్యూస్,ఖానాపూర్
పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలి: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ సమావేశం
పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 11వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో శనివారం పేరెంట్స్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం హాజరై మాట్లాడారు.ప్రతి ఒక్క పాఠశాలలో ప్రతి మూడోవ శనివారం రోజున తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలలో సమస్యల, కార్యక్రమాల పైన అవగాహన కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గేలత , టీచర్స్ శ్రీనివాస్ , ఏపిపిసి అధ్యక్షురాలు నది సమతా , అంగన్వాడి టీచర్ విజయ , తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.