5 ఎంబీబీఎస్ సీట్లు సాధించిన రుద్రవరం ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం…..
సిరా న్యూస్,రుద్రవరం;
పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని ఆదర్శ పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వపు విద్యార్థులు నిరూపించారని ఆ పాఠశాల ప్రిన్సిపల్ సంగెపు నాగేశ్వరరావు తెలిపారు.
రుద్రవరం ఆదర్శ పాఠశాలలో విద్యను అభ్యసించిన 5 గురు విద్యార్థులు నీటిలో స్టేట్ ర్యాంకు సాధించి మెడికల్ సీట్లు పొందారు.5 మెడికల్ సీట్లు సాధించిన రుద్రవరం ఆదర్శ పాఠశాల విద్యార్థులకు ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం శనివారం ఘనంగా సన్మానించారు.
రుద్రవరం ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో విద్యనిభ్యసించిన పూర్వ విద్యార్థులు నీటిలో అర్హత సాధించి ఎంబిబిఎస్ సీట్లు పొందడం తమకు గర్వంగా ఉందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు తెలిపారు.
రుద్రవరం గ్రామానికి చెందిన జజ్జారి బిందూ, ఛాయా దేవి,లోకేష్ పూజిత, శరత్ అనే ఐదుగురు విద్యార్థులు నీటిలో అర్హత సాధించి ఎంబిబిఎస్ సీట్లు పొందారు. తమ పాఠశాలలో విద్యను అభ్యసించిన ఈ ఐదుగురు విద్యార్థులు కడప జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు పొందారని ప్రిన్సిపల్ తో పాటు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులందరు శనివారం వారిని అభినందించి, ఘనంగా సత్కరించారు.ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి మంచి స్థాయి కి ఎదిగి దేశానికి ,మన రాష్ట్రానికి,గ్రామానికి సేవ చేయాలి అని అన్నారు.ఈ 5 గురు మన పాఠశాల లో ఉన్న 600 మందికి స్ఫూర్తి అని అన్నారు. ఇష్టపడి కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమే అని అన్నారు అందుకు ఈ అయిదుగురు విద్యార్థులు నిదర్శనమని అన్నారు. రుద్రవరం మండలం నుంచి 5 గురు విద్యార్థులు ఎంబిబిఎస్ సీట్లు సాధించడం ఎంతో అభినందనీయమని అన్నారు మీరు మండలానికి మాత్రమే కాదు, మనందరికీ ఆదర్శమే. మన పాఠశాలలో 6 వ తరగతి నుండి 10 వరుకు చదివి మంచి మార్కులు సాధించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారని తెలిపారు.
అదే బాటలో,అదే విధంగా ఇప్పుడు ఉన్న విద్యార్థులందరూ బాగా చదివి, మన మండలానికి మన స్కూలుకి మంచి పేరు తేవాలని ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ, విద్యార్థులు తల్లి తండ్రులు పాల్గొన్నారు. ఎంబిబిఎస్ సీట్లు సాధించిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను ప్రిన్సిపాల్ కొనియాడారు.