సిరాన్యూస్, ఖానాపూర్
మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేత: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 6వ , 7వ వార్డులలో శనివారం మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం సబ్సిడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని తెలిపారు.ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సహకారంతో ఖానాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ , కో ఆప్షన్ సభ్యులు బండారి కిషోర్ ,నాయకులు శేషాద్రి, నయిం, కుర్ షిత్ ఖాన్,జియా, వహబ్ వొద్దిన్, గణి, ముబిన్,జియా, పేరోజ్,కాలనీ వాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.