సిరాన్యూస్, చిగురుమామిడి
ఓటర్ల తుది జాబితా ప్రదర్శన : ఎంపీడీవో ఖాజా మైనోద్దీన్
రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్,జిల్లా పంచాయతీ అధికారి ఆమోదించిన గ్రామపంచాయతీ వార్డుల వారి ఓటరు జాబితాను కరీంనగర్ జిల్లా. చిగురుమామిడి మండలంలోని 17 గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీస్ బోర్డులపై ప్రదర్శించడం జరిగిందని ఎంపీడీవో ఖాజామైనొద్దీన్ తెలిపారు.శనివారం మండల పరిషత్ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై తుది జాబితాను ప్రదర్శించారు. ఈనెల సెప్టెంబర్ 13 తారీఖు నాడు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించిన ఓటరు జాబితా ముసాయిదాపై మండలంలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల,ప్రజల సలహాలు సూచనలు స్వీకరించి తుది జాబితా తయారు చేసినట్లు తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో మూడు ప్రతులు పరిశీలనార్థం ఉంచడం జరిగిందని తెలిపారు.