సిరాన్యూస్,ఖానాపూర్
యూనియన్ కు సహాయ సహకారాలు అందిస్తా: మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
ప్రవేట్ ఎలక్ట్రిషన్ యూనియన్ అసోసియేషన్‌కు సహాయ సహకారాలు అందిస్తానని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ ప్రవేట్ ఎలక్ట్రిషన్ యూనియన్ అసోసియేషన్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం హాజరై మాట్లాడారు.ప్రవేట్ ఎలక్ట్రిషన్ అసోసియేషన్ సభ్యుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం యూనియన్ సభ్యులు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నాయకులు షబ్బీర్ పాషా, ,ప్రవేట్ ఎలక్ట్రిషన్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు