సిరా న్యూస్,ఖానాపూర్
వెటర్నరీ వైద్యుడి పై చర్యలు తీసుకోవాలి : బీఎస్పీ ఖానాపూర్ అసెంబ్లీ అధ్యక్షులు కుక్కరికరి రాజేష్
వెటర్నరీ వైద్యుడి పై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు కుక్కరికరి రాజేష్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పశు వైద్యాధికారి రామచంద్రుడు విధుల పట్ల నిర్లక్ష్యం పై జిల్లా పశు వైద్య అధికారి బలీగ్ అహ్మద్ కి లిఖితపూర్వకంగా పిర్యాదు చేశారు. ఈసందర్బంగా బహుజన్ సమాజ్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు కుక్కరికరి రాజేష్ మాట్లాడారు. వెటర్నరీ వైద్యుడి రైతులకు అందుబాటులో ఉండటం లేదని, పశువులను వైద్యం కోసం తీసుకువచ్చిన వారితో అమర్యాదగా మాట్లాడుతూ బెదిరిస్తున్నాడని తెలిపారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బిఎస్పీ అసెంబ్లీ నాయకులు అభియాదవ్, శివానంద్ గౌడ్, నవీన్ పాల్గొన్నారు.