యూటర్న్ లు తీసుకుంటున్న వివాదం…
సిరా న్యూస్,తిరుమల;
చిన్నగా మొదలై..పెద్ద ఇష్యూ అయింది. ఏపీకే పరిమితం అనుకున్న ఇష్యూ.. యావత్ హిందూలోకం రియాక్షన్‌కు రీజన్ అయింది. నేషనల్ టాపిక్ అయిన తిరుమల లడ్డూ వివాదం రోజురోజుకు పెద్దది అవుతోంది. బ్రహ్మాండనాయకుడి ప్రసాదం చుట్టూ.. పొలిటికల్ రచ్చ జరుగుతోంది. ఇన్ని రోజులు లోకల్‌వార్‌గా కొనసాగిన శ్రీవారి లడ్డూ వివాదం..అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కెడంతో..ఇది ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది.లడ్డూ ప్రసాదంలో కల్తీ అంశం సప్రీంకోర్టుకు చేరడం..సిట్ విచారణ ఆగిపోవడంతో నెయ్యి ఇష్యూ మరింత పీక్ లెవల్‌కు చేరుకుంది. అయితే సిట్ విచారణ వద్దని కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ జాతీయ నేత సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో ఇద్దరు పిటీషన్లు వేశారు.వీటిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నెయ్యి కల్తీ అయినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించడంతో పాటు.. దేవుడ్ని రాజకీయాలకు లాగొద్దంటూ అభిప్రాయపడటం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇస్తే మంచిదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే..దర్యాప్తు సీబీఐ లేదా మరో కేంద్ర దర్యాప్తు సంస్థ చేతికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.ఇప్పటికే సీఎం చంద్రబాబు నియమించిన ఐజీ స్థాయి అధికారితో మొత్తం 9 మంది సభ్యుల సిట్ బృందం కొంత సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. అయితే కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో సిట్ దర్యాప్తును ఆపేసినట్లు ఏపీ డీజీపీ ప్రకటించారు. రికార్డులు పరిశీలించడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో నెయ్యి కొనుగోలుకు సంబంధించి సిట్ బృందం అన్ని వివరాలు తీసుకుంది. ఒక సంస్థకు టెండర్లు దక్కితే మరో సంస్థ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోందిఏఆర్ డెయిరీకి నిబంధనల ప్రకారం అర్హత లేకపోయినా.. కావాలనే టెండర్ నిబంధనలు సవరించి ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే నెయ్యి కూడా ఏఆర్ డెయిరీ నుంచి రావడం లేదని.. శ్రావణి డెయిరీ అనే సంస్థ నుంచి సరఫరా అవుతున్నట్లు టాక్. సేమ్‌టైమ్ సరైన టెస్టులు చేయకుండానే నెయ్యిని లడ్డూల తయారీకి వాడుతున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.సిట్ దర్యాప్తు ఆగిపోవడం..సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి ఎంక్వైరీకి ఆదేశిస్తే లడ్డూ వివాదం మరో టర్న్ తీసుకోబోతుందన్న చర్చ జరుగుతోంది. సీబీఐ దర్యాప్తు చేస్తే కూడా సిట్ టీమ్ నుంచి ప్రాథమిక వివరాలను తీసుకుంటుంది. సిట్ ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే అది సీబీఐకి బదిలీ చేయాల్సి ఉంటుంది. రెండ్రోజుల్లో సుప్రీంలో విచారణ ఉంది. ఒకవేళ కోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగితే..లడ్డూ వివాదంపై మరో లెవల్‌కు చేరుకోనుంది.నెయ్యి సరఫరా టెండర్లు దక్కింది ఏ సంస్థకు.. నెయ్యి సప్లై చేస్తుంది ఎవరు? కల్తీ జరిగితే జంతువుల ఫ్యాట్ కలిసింది నిజమా కాదా అనేది సీబీఐ దర్యాప్తులో తేలనుంది. అయితే సిట్ కంటే సీబీఐ దర్యాప్తులో అసలు విషయాలు బయటికి వస్తే..అందరూ నమ్మే అవకాశం ఉంటుంది. సిట్ రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండటంతో కూటమి సర్కార్ ప్రభావితం చేసిందన్న ఆరోపణలు వచ్చే అవకాశం లేకపోలేదు. సీబీఐ ఎంక్వైరీలో అసలు బయటికి వస్తాయా.? దర్యాప్తులో నిజానిజాలు బయటికి వస్తే నెయ్యి వివాదం ఎవరి మెడకు చుట్టుకుంటుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున టీటీడీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్క టీటీడీ చైర్మన్ మూడున్నర లక్షల టిక్కెట్లు తన కోటాలో మంజూరు చేశారని.. రోజా, పెద్దిరెడ్డి వేల కొద్దీ టిక్కెట్లు తీసుకుని అమ్ముకున్నారన్న టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ నెయ్యి కల్తీ కేసులో తీగలాగితే.. మిగతా విషయాలు కూడా బయటకు వస్తే కొందరు వైసీపీ నేతలు బద్నాం అవడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. అందుకే సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనే అంతా అయిపోలేదని ముందు ముందు చాలా కథ ఉందని టీడీపీ నేతలంటున్నారు.