సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసియున్న శ్రీ ఉషారాజ రాజేశ్వరి సమేత శ్రీబానులింగేశ్వరస్వామివారి ఆలయం., నాగుల చవితిని పురస్కరించుకుని., భక్తులతో కిక్కిరిసింది. నాగులచవితి సందర్భంగా శ్రీబానులింగేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్ధం పుట్టలను ఏర్పాటు చేసారు. తెల్లవారుజాము నుండి పెద్దసంఖ్య లో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఆలయ ప్రాంగణంలోగల పుట్టల్లో నాగేంద్రస్వామివారికి భక్తి శ్రద్దలతో పూజలు చేసి మ్రొక్కుబడులు చెల్లించు కున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుట్టల్లో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన ప్రసాదాలు, పాలు, గుడ్లు వేసి పూజలు చేసారు. అశేషంగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా సందడి వాతావరణం నెలకుంది. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ, స్వామి వారికి పంచా మృతాభిషేకాలు, విశేషపూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. నాగులచవితి సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటి చైర్మన్ కేళ్ళంగి వెంకట శివప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు, పెద్దసంఖ్యలో భక్తులు, మహిళలు, పాల్గోన్నారు.