మద్ది అంజనేయస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

సిరా న్యూస్,జంగారెడ్డిగూడెం;
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేం చేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసములో వచ్చిన మొదటి మంగళవారం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దేవాలయములో ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు , కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ మాట్లాడుతూ కార్తీకమాస ఉత్సవాలు , సప్తహ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకుని, తీరదప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆర్వి చందన , పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ , కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *