సిరా న్యూస్,పెద్దపల్లి;
మండలంలోని హన్మంతుని పేట గ్రామానికి చెందిన శ్రీ రామకృష్ణ భజన మండలికి నేషనల్ యునికాన్ అవార్డు వరించింది. ఏపీ తిరుపతిలో స్వరవాని కల్చర్ అకాడమి, స్నేహా కల్చర్ అకాడమి ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నైపుణ్య ప్రదర్శనతో శ్రీ రామకృష్ణ భజన మండలి అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో భజన మండలి సభ్యులకు మేడగోని శ్రీనివాస్ చేతుల మీదుగా అవార్డులను అందించి అభినందించారు. కార్యక్రమంలో బృందం సభ్యులు నాగల మల్లాల వెంకటేశం, బయ్య కొమురయ్య, కారుపాకల కనకయ్య, సత్యం, ఆరేపల్లి రాయలింగు, కందుల గురుస్వామి, కంది చంద్రయ్య, గుర్రాల శంకర్, యాదగిరి రమేష్, చేరాలు, అడప సతీష్, బాల్సాని శంకర్, సురభి నందరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.